వాట్సాప్ ద్వారా సేవలు : కర్నూలు డిఐజీ

0
231

కర్నూలు :

కర్నూలు జిల్లా...

వాట్సాప్ గవర్నెన్స్  ‘మన మిత్ర’లో  FIR డౌన్‌లోడ్ సౌకర్యం 

పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందవచ్చని ... 
డిఐజి,   కర్నూలు  జిల్లా ఇన్ చార్జీ  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు వెల్లడి

 జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మేరకు సూచనలు జారీ.

 * పారదర్శకతతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి మనమిత్ర సేవలు ఉపయోగపడుతాయి.

ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన మరియు పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ – “ *మన మిత్ర”* సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని డిఐజి,   కర్నూలు  జిల్లా ఇన్ చార్జీ  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు జిల్లా ప్రజలకు సోమవారం  విజ్ఞప్తి చేశారు. 

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు...ప్రతి FIR నమోదు అనంతరం ఫిర్యాదుదారులు తమ FIR ప్రతిని పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.

 *FIR డౌన్‌లోడ్ విధానం:* 

 *ఫిర్యాదుదారు 95523 00009 నంబర్‌ను తన మొబైల్‌లో సేవ్ చేసి వాట్సాప్‌లో “Hi” పంపాలి.* 

 *మెనూ నుండి Police Services → Download FIR ఎంపిక చేసుకోవాలి.* 

 *అవసరమైన వివరాలను నమోదు చేసి FIR ప్రతిని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.* 

ఈ సేవల ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు, పోలీస్ సేవల్లో మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. 

జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ అధికారులు ఈ సేవపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించామని... ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  డిఐజి,  కర్నూలు  జిల్లా ఇన్ చార్జీ  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు కోరారు.

Search
Categories
Read More
Telangana
సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా
మహబూబాబాద్, డిసెంబర్ 21(భారత్ అవాజ్): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం రోజున మహబూబాబాద్...
By Bheeshman King 2025-12-21 12:55:48 0 373
Telangana
ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రం లో mp డీకే అరుణమ్మ
ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రం లో mp డీకే అరుణమ్మ గారు జిల్లా టీం ను మరియు సర్పంచ్ ఉపసర్పంచ్...
By Vanmoj Suryamohan 2025-12-24 13:03:01 0 430
Telangana
పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
మహబూబాబాద్ జిల్లా...   నర్సింహులపేట  మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా...
By Midathapalli Kiran Kumar 2026-04-27 08:57:52 0 279
Andhra Pradesh
గుంటూరు పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం...
By Benguluri Madhubabu 2026-03-25 05:58:38 0 235
Telangana
సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి.|
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కేసు పెండింగ్‌లో ఉండగా, కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్న అజారుద్దీన్...
By Sidhu Maroju 2025-12-26 09:42:04 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com