రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం

0
298

రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం

ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి దిశానిర్దేశంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది

చీరాల: చీరాల పట్టణం ఉజిలిపేట నందు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాసుపుస్తకాల్లోని తప్పిదాలను సవరించి, ప్రభుత్వ రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్స్‌తో రూపొందించిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు, భూయజమానులకు అందజేయడం జరిగింది.
 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే నిర్వహించింది. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌లతో కూడిన  21.86 లక్షల పాస్ పుస్తకాలను వెబ్ ల్యాండ్‌లోని వివరాలతో సహా ముద్రించడం జరిగింది. 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ నుంచి విముక్తి కలగించి, నేడు జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసిన సీఎం చంద్రబాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..

ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ గారు చీరాల ఎమ్మార్వో , AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి....
By Kothuru Murali 2026-02-11 08:48:19 0 195
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను...
By Boya Dasthagiri 2026-03-28 23:49:06 0 420
Andhra Pradesh
Construction of New Assembly Building in Amaravati Begins
The construction of the Andhra Pradesh Legislative Assembly building in Amaravati has officially...
By BMA ADMIN 2025-05-19 12:13:51 0 3K
Andhra Pradesh
ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం.
మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో...
By Pagadala Venkateswar 2026-07-15 05:32:58 0 103
Andhra Pradesh
చాలీచాలని వేతనాలతో విఆర్ఏల ఆవేదన
*చాలీచాలని వేతనాలతో వీఆర్ఏల ఆవేదన*   *వీఆర్ఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు*  ...
By Rajini Kumari 2025-12-16 11:44:36 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com