ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యం

0
200

కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

23 మందికి రూ.40.68 లక్షల ఎల్.ఓ.సీలు మంజూరు.

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 01.04.2026.

 

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కూటమి నేతలతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి)లను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మార్చి 13 నుంచి 31వ తేదీ వరకు పంపిన అర్జీలకు గానూ 23 మందికి రూ.40,68,061ల విలువైన ఎల్.ఓ.సిలు మంజూరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా కూటమి ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన, సామాన్య వర్గాల పట్ల తన బాధ్యతను విస్మరించకుండా, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 

 

కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పనిచేస్తోందన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

అనారోగ్యంతో బాధపడుతూ ఆపదల్లో ఉన్న కుటుంబాలకు సకాలంలో ఎల్.ఓ.సిలు అందడం వల్ల వారి తక్షణమే వైద్య సేవలు లభించి, జీవితంలో కొత్త వెలుగులు నింపుతున్నాయని లబ్ధిదారులు భావోద్వేగంతో తెలిపారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ వేణుగోపాల్
అన్నమయ్య జిల్లా సోమల మండలం లోని D-కొత్తూరులో 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ...
By Kothuru Murali 2026-03-20 05:43:35 0 201
Andhra Pradesh
పుంగనూరు: భద్రకాళి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ విరుపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు...
By Kothuru Murali 2026-05-16 15:48:13 0 121
Andhra Pradesh
మదనపల్లి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-02-01 11:58:05 0 287
SURAKSHA
Operation Parivartan: AP Police's Mission for Drug-Free Society
The 'Operation Parivartan' led by the Andhra Pradesh Police is a historic initiative for tribal...
By Kalaga Sailaja 2026-06-24 06:04:39 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com