గుంటూరు వెస్ట్ డీస్పీ శ్రీ కె. అరవింద్ గారు విద్యార్థులకు మాదగద్రవ్యాల అవగాహన సదస్సు సంకల్పం కార్యక్రమం చేసినారు. గుంటూరు జిల్లా ఎస్పీ మరియు ఐజి ఆదేశాల మేరకు.

0
739

గుంటూరు జిల్లా పోలీస్...* *పట్టాభిపురం పోలీస్ స్టేషన్* *తేది: 31.12.2025* _*//“డ్రగ్స్ వినియోగం – మానవ మనుగడకే ప్రమాదం” — గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీ కె. అరవింద్ గారు,.//*_ 📍 గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మానవ ప్రాణాలకే కాకుండా, భవిష్యత్తు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీ కె. అరవింద్ గారు హెచ్చరించారు. 📍 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, “సంకల్పం” కార్యక్రమంలో భాగంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని TJPS కళాశాల నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గారు విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ❇️డ్రగ్స్‌ వినియోగం ఒక్కసారిగా ఆసక్తితో మొదలైనప్పటికీ, అది జీవితాంతం వెంటాడే వ్యసనంగా మారుతుందని తెలిపారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా జీవితం మలుచుకోవాలని సూచించారు. ❇️స్నేహితుల ఒత్తిడితో గానీ, సరదా కోసం గానీ మత్తు పదార్థాలకు అలవాటు పడితే, అది శారీరకంగా, మానసికంగానే కాకుండా మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ సేవించే వారు ఏదో ఒక రోజు తప్పకుండా పోలీసులకు చిక్కుతారని, NDPS చట్టం కింద కేసులు నమోదైతే కనీసం 10 సంవత్సరాల నుండి గరిష్టంగా 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది యువత జీవితంలో అత్యంత కీలక సమయాన్ని కోల్పోయే ప్రమాదాన్ని తెస్తుందని పేర్కొన్నారు. ❇️గంజాయి లేదా డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఎవరి గురించి అయినా సమాచారం ఉంటే, టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని డీఎస్పీ అరవింద్ గారు ప్రజలను కోరారు. 👉 పోలీస్ డాక్టర్‌గా పేరుగాంచిన ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీ మండవ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, డ్రగ్స్‌, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత, విద్యార్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఇవి శారీరకంగా, మానసికంగా తీవ్ర నష్టం కలిగిస్తాయని చెప్పారు. ఆరు నెలల పాటు గంజాయి సేవిస్తే నరాల బలహీనత ఏర్పడుతుందని, ఏడాది పాటు వినియోగిస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని, ఏడాదిన్నర పాటు నిరంతరంగా గంజాయి సేవిస్తే ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు పోలీసులు, ఈగల్ బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ❇️ పట్టాభిపురం సీఐ శ్రీ గంగా వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలో మంచి–చెడులను గుర్తించి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించి, ఉన్నత స్థానాలను సాధించి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని విద్యార్థులను కోరారు. ❇️ కళాశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, పెద్దల సూచనలు పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని దాచుకోకుండా ఉపాధ్యాయులతో పంచుకుని పరిష్కారం పొందాలని సూచించారు. 👉 ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీ కె. అరవింద్ గారితో పాటు పట్టాభిపురం సీఐ శ్రీ గంగా వెంకటేశ్వర్లు గారు, ఎస్సైలు శ్రీ రామాంజనేయులు గారు, శ్రీమతి తరంగిణి గారు, TJPS కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కామేశ్వర శాస్త్రి గారు, కళాశాల యాజమాన్యం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-02-28 10:54:55 0 158
Andhra Pradesh
ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు...
By Boiena Rajesh 2026-04-10 01:02:38 0 152
Andhra Pradesh
ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు.
ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల...
By Pagadala Venkateswar 2026-04-11 06:55:59 0 112
Puducherry
Blue Tech: Puducherry’s First Floating Solar Farm
Puducherry takes a massive leap toward green energy with the inauguration of its first...
By Dunna Jessicaruth 2026-05-14 10:59:19 0 140
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు రాచ మర్యాదలు
**దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర...
By Rajini Kumari 2026-04-23 12:24:18 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com