రైలు వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3 పర్సెంట్ రాయితీ ! రైల్వే

0
239

కర్నూలు # రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ

▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు.

రైళ్లలో అర్రిజర్వ్డ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని 'రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది.

Search
Categories
Read More
Telangana
తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
తలకొండపల్లి లోని  హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు  పెద్ద సంఖ్యలో లైన్ లో...
By MERIGE MALLESH 2026-03-25 09:22:54 0 408
Andhra Pradesh
పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ...
By Kothuru Murali 2026-06-16 13:42:33 0 86
Telangana
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం*   *విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు*...
By Terli Ashok 2026-01-08 03:51:29 0 320
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం : అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
By Kothuru Murali 2026-02-20 08:32:58 0 158
Mizoram
PM SHRI Scheme: Revamping 35 Mizoram Government Schools
The Mizoram education sector is set for a transformative upgrade as 35 government schools have...
By Lokeshwari Panthadi 2026-07-02 06:55:18 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com