విజయవాడ పింఛన్ అందించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

0
279

*విజయవాడ నగరపాలక సంస్థ*

*31-12-2025*

 

 

*పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*

 

 

 

విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం మిథిలా నగర్, విద్యాధరపురం, పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

 

 

ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పింఛను వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి, ప్రతినెలా ఇస్తున్న పింఛను తీరును పరిశీలించారు. 

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతన సంవత్సరం పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే పింఛను పంపిణీ చేస్తున్నారని అన్నారు. సిబ్బంది ఉదయం ఆరింటికల్లా పింఛను పంపిణీ మొదలుపెట్టరని, పింఛను పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పింఛను లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛను అందిస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోగల సర్కిల్ 1 పరిధిలో 18,476 పెన్షన్లు, సర్కిల్ 2 పరిధిలో 23,396, సర్కిల్ 3 పరిధిలో 18,268 పెన్షన్లు ఉన్నాయని, వారందరికీ సిబ్బంది సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

 

తదుపరి ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డు వద్ద గల అన్న కాంటీన్ పరిశీలించారు. అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి స్వయంగా ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు, త్రాగునీరు, వాడుక నీరు నిరంతరాయంగా రావాలన్నారు. నోడల్ ఆఫీసర్లు అందరూ తమ తమ అన్న క్యాంటీన్లోని ప్రతిరోజు వీక్షించి ఎటువంటి లోపాలు ఉన్న వెంటనే సరి చేయాలని, ఎటువంటి రిపేర్లు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారాలను ఆదేశించారు.

 

 

ఈ పర్యటనలో కమిషనర్ తో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

 

Search
Categories
Read More
Kerala
Kerala’s Greenfield Highway & NH Upgrade Projects Now in Limbo
Two major infrastructure plans—the Kozhikode–Mysore greenfield corridor and the...
By Bharat Aawaz 2025-07-17 08:34:09 0 2K
Telangana
C M Revanth reddy participated candles rally
హైదరాబాద్‌ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్‌)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం...
By G k Nookala 2026-07-25 15:18:02 0 126
West Bengal
PM-KISAN: ₹907 Cr Transferred to 45 Lakh Bengal Farmers
In a massive boost to West Bengal's rural economy, over 45.35 lakh farmers across the state have...
By Lokeshwari Panthadi 2026-06-25 12:01:40 0 107
Telangana
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
By Vanmoj Suryamohan 2025-12-29 14:37:18 0 462
Andhra Pradesh
ఈగల్ టీం తనిఖీల్లో పూరి - తిరుపతి ట్రైన్లో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ పట్టివేత 8 మంది అరెస్ట్
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి...
By Gadiyapudi Narendra 2026-03-26 17:14:18 0 564
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com