గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల: వైసీపీ.

0
225

గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో కంది రైతులు విలవిలలాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం. రైతు సంక్షేమం), ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

2025–26లో రాష్ట్రంలో దాదాపు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది కేవలం వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే పంట. ఏటా ఒకసారి మాత్రమే సాగవుతుంది. కంది కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) క్వింటా రూ.8 వేలు కాగా, ఇప్పుడు రైతులు క్వింటా కంది రూ.6500 నుంచి రూ.6600 వరకు అమ్ముకుంటున్నారు. అదే పక్కన కర్ణాటకలో ప్రభుత్వం స్వయంగా కొనుగోలు కేంద్రాలు తెరిచి, క్వింటా కంది రూ.8 వేలకు కొంటున్నట్లు చెబుతున్నారు. ఏ పంట అయినా మార్కెట్‌కు వచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిస్తే రైతులు వ్యాపారుల బారినపడి నష్టపోరు. 

ఆ ఆలోచనే లేని ప్రభుత్వం:

రాష్ట్రంలో కంది ప్రధానంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో సాగు చేశారు. గత ఏడాది పంట ఉత్పత్తి 171 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది అంచనా 117 లక్షల టన్నులు. అలాగే గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 473 కిలోలు కాగా, ఈ ఏడాది అది కూడా 401 కిలోలకు తగ్గింది. అలా గత ఏడాది కంటే ఈసారి పంట ఉత్పత్తి, సగటు దిగుబడి రెండూ తగ్గాయి.

మొక్కజొన్న దుస్థితి:

మొక్క జొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) క్వింటా రూ.2400 కాగా, రైతులు క్వింటా మొక్కజొన్న రూ.1500 నుంచి రూ.1900 వరకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఈ పంటను రాష్ట్రంలో ఈ సీజన్‌లో 4.6 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, అదీ సగటు దిగుబడి తగ్గింది. పొరుగున తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి, ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలుపెట్టగా, మన ప్రభుత్వానికి మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో వచ్చిన కాడికి రైతులు తక్కువ ధరకు పంట అమ్ముకుంటున్నారు.

కంది మాదిరిగా మొక్కజొన్న సగటు దిగుబడి గత ఏడాది కంటే బాగా తగ్గుతుందని అంచనా. మొక్కజొన్న గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 4710 కిలోలు కాగా, ఈ ఏడాది 4254 కిలోలు మాత్రమే అంచనా వేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా చూస్తే, అది ఇంకా తగ్గే దుస్థితి కనిపిస్తోంది.

 

కష్టాల్లో రైతాంగం:

కేవలం కంది, మొక్కజొన్న మాత్రమే కాదు. అనేక పంటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అనావృష్టి లేక అధిక వర్షాలకు సాగు తగ్గి, దిగుబడి తగ్గి, అమ్మకం ధరలు పడిపోయాయి. ఎమ్మెస్పీకి ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయకపోవడం, ఉచిత పంటల భీమా పథకం రద్దు, సున్నా వడ్డీ పంట రుణాలు అమలు చేయకపోవడం, చివరకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవలోనూ మోసం.. ఇవన్నీ వెరసి రైతులను తీవ్ర నష్టాల పాల్జేసి, వారిని ఆర్ధిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. 

ఇంత జరుగుతున్నా, ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్రభుత్వ పెద్దలూ.. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. ‘రైతు కంట కన్నీరు మంచిది కాదు. అది అరిష్టం అని నాగిరెడ్డి హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం.
రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన...
By Pagadala Venkateswar 2026-07-09 04:54:34 0 105
Andhra Pradesh
చిత్తూరు: ఉపాధ్యాయురాలు శాశ్వతంగా విధుల నుంచి తొలగింపు: డీఈవో
ఉమ్మడి చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, బండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు...
By Kothuru Murali 2026-05-23 14:05:45 0 107
Telangana
సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు
సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము...
By Sadaq Sadaq 2026-02-01 11:23:02 0 328
Telangana
నిజామాబాద్: అద్నాపు కలెక్టర్ గా ప్రదీప్ కుమార్ భాద్యతలు
నిజామాబాద్ అదానపు కలేక్టర్ (స్థానిక సంస్థలు)  గ నగరపాలక సంస్థ కామిష్ణర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-03-02 15:34:29 0 206
Telangana
"వార్డు మెంబర్ నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరకు: వెంకటేశం గుప్తా విజయ ప్రస్థానం.|
మెదక్ జిల్లా: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కాళ్లకల్ గ్రామానికి చెందిన ప్రముఖ...
By Sidhu Maroju 2026-05-02 09:44:02 0 321
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com