ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ

0
208

*పత్రికా ప్రకటన*

*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 28, 2025*

 

*ఆరోగ్యం, కాలుష్య ర‌హిత భ‌విత‌కు సైకిల్ సవారీ..*

- *పెడ‌ల్ ఫ‌ర్ ఫిట్‌నెస్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలి*

- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*

 

ఆరోగ్య‌క‌ర జీవితంతో పాటు కాలుష్య ర‌హిత భ‌విష్య‌త్తుకు సైకిల్ స‌వారీ దోహ‌దం చేస్తుందని.. చిన్నారులు, యువత సైక్లింగ్‌ను ఓ ఆనంద‌క‌ర అల‌వాటుగా చేసుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వ‌ర్యంలో ఫిట్ ఇండియా ఆన్ సండేస్ సైకిల్ ర‌న్ కార్య‌క్ర‌మం న‌గ‌రంలోని డా. బీఆర్ అంబేద్క‌ర్ స్మృతివ‌నం వ‌ద్ద జ‌రిగింది. ఇందులో భాగంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సైక్లింగ్‌ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు 50 మందికిపైగా చిన్నారుల‌తో పాటు క్రీడా శాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో క‌లిసి బెంజ్ స‌ర్కిల్‌, పాలీ క్లినిక్ రోడ్డు, పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌, రెడ్ స‌ర్కిల్ మీదుగా దాదాపు 9 కి.మీ. సైక్లింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ శారీర‌క ఆరోగ్యం ఎంత ముఖ్య‌మో మాన‌సిక ఆరోగ్య‌మూ అంతే ముఖ్య‌మ‌ని.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌డంతో పాటు భావిత‌రాల‌కు కాలుష్య ర‌హిత ప‌ర్యావ‌ర‌ణాన్ని వార‌స‌త్వ సంప‌ద‌గా అందించేందుకు ప్ర‌తిఒక్క‌రూ సైక్లింగ్ ను హాబీగా మార్చుకొని ముందుకువెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానమవుతుందని పేర్కొన్నారు. అందుకే అవగాహన పెంచుకొని సైక్లింగ్ ను అభిరుచిగా మార్చుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో డీఎస్‌డీవో కాక‌ర్ల కోటేశ్వ‌ర‌రావు, జిల్లా సైక్లింగ్ అసోసియేష‌న్ స‌భ్యులు సుగుణ‌రావు, కోచ్ రాహుల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ సత్యసాయి జిల్లా: ముగ్గరు అవినీతి అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ గారు
తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు - శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం.......
By Eslavath RameshNaik 2026-01-20 04:41:55 0 695
Telangana
బైక్ ర్యాలీ...
ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ...
By Sadaq Sadaq 2026-09-05 14:43:02 0 142
Andhra Pradesh
పుంగనూరు: అంబటి ఇంటి మీద దాడి పై స్పందించిన పెద్దిరెడ్డి
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By Kothuru Murali 2026-02-01 09:46:56 0 214
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్...
By Boya Dasthagiri 2026-07-14 00:50:14 0 135
Telangana
కాలనీ కష్టాలపై కదిలిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
● భీంరావ్ నగర్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ● దెబ్బతిన్న...
By Sidhu Maroju 2026-08-01 11:05:21 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com