వోటర్ మ్యాపింగ్ లో కర్నూలు జిల్లాకు 14వ స్థానం :: కలెక్టర్

0
199

కర్నూలు : కర్నూలు జిల్లాలో ఓటరు మ్యాపింగ్ 47.90 శాతం ఉందని, రాష్ట్రంలో కర్నూలు జిల్లా 14వ స్థానంలో నిలిచిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జనవరి చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను సరిగా చేపట్టని ఇద్దరు బీఎల్వోలను సస్పెండ్ చేశామన్నారు. మున్ముందు బీఎల్వోలు నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏ) వెంటనే నియమించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో కలెక్టరేట్ లో ఉన్న ఈవీఎం గోదామును శనివారం త్రైమాసిక తనిఖీ చేపట్టారు. పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని అక్కడి అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటరు జాబితాలో రూపకల్పన బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సంక్రాంతి రాక రైళ్లు కిటకిట
*కాలు పెట్టగలిగితే హీరోనే!*   * సంక్రాంతి నేపథ్యంలో రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి....
By Rajini Kumari 2026-01-13 16:18:05 0 189
Andhra Pradesh
కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం
  ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా...
By BABJI DADALA 2026-01-12 14:50:58 0 595
Andhra Pradesh
కోడి రామ్మూర్తి స్టేడియం పనుల వేగవంతం
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులను శుక్రవారం స్వయంగా...
By Manda Ramkumar 2026-03-27 13:04:14 0 214
Business & Finance
Protect Your Employees with Easy ESI Registration
Complete your ESI registration online with expert assistance and ensure your business complies...
By Navya Sree 2026-07-08 08:26:34 0 60
Andhra Pradesh
పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు.
చీరాల: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చీరాల పట్టణంలో శనివారం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి...
By Gadiyapudi Narendra 2026-02-21 16:33:05 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com