మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారమే

0
253

*మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారమే* 

 

*నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ* 

 

*గండాలయ పేటలో కార్డెన్ సెర్చ్*

 

*సరియైన ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు స్వాధీనం*

 

 

*మంగళగిరి:*

మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారం అవుతాయని నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ అన్నారు. గుంటూరు రేంజి ఐజిపి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ పరిధిలో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం నగరంలోని గండాలయ పేటలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి రవాణా విక్రయాలు, వినియోగంపై తమకు గానీ, 1972 కు సమాచారాన్ని అందిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ పై ప్రజల్లో చైతన్యం కలిగించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ సీఐలు వీరాస్వామి, బ్రహ్మం తో పాటు పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా.రు

Search
Categories
Read More
Andhra Pradesh
దేవినేని అవినాష్ కామెంట్స్
*దేవినేని అవినాష్ కామెంట్స్*       బడుగు బలహీన వర్గాలు కోసం పని చేసిన నాయకుడు...
By Rajini Kumari 2026-01-07 16:22:12 0 226
Telangana
హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట భూములు కోల్పోయిన రైతుల ధర్నా
హుజూర్‌నగర్, జూలై 27:   వ్యవసాయ కళాశాల కోసం 1041 సర్వే నంబరులో భూములు కోల్పోయిన...
By Malla Rambabu 2026-07-27 14:14:37 0 207
Andhra Pradesh
పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న...
By Kothuru Murali 2026-02-08 10:22:25 0 203
Telangana
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు
మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా...
By Avunoori Mahesh 2026-04-11 06:30:42 0 216
Andhra Pradesh
అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.
మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి...
By Pagadala Venkateswar 2026-04-22 03:03:54 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com