పౌర హక్కుల సంఘం పోస్టర్ ఆవిష్కరణ

0
271

పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడదాం: 

పౌరహక్కుల సంఘం పిలుపు

విజయవాడ,డిసెంబర్ 27:

రాజ్యాంగానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, పౌర హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పౌరహక్కుల సంఘం (సిఎల్సీ) పిలుపునిచ్చింది. శనివారం విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ 20వ రాష్ట్ర మహాసభల పోస్టర్, కరపత్రాన్ని సంఘం ప్రతినిధులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి పి. రాజారావు రాష్ట్ర సహాయ కార్యదర్శి టి. ఆంజనేయులు మాట్లాడుతూ, వచ్చే నెల జనవరి 10, 11 తేదీల్లో తిరుపతి నగరంలో ఈ 20వ రాష్ట్ర మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 'రాజ్యాంగం-నిర్బంధం' అనే ప్రధాన అంశంపై ఈ సభలు జరుగుతాయని, పౌరహక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ మహాసభలు సాగుతాయని వారు పేర్కొన్నారు.

మహాసభలను సీనియర్ జర్నలిస్ట్ మరియు అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షులు రాఘవశర్మ ప్రారంభిస్తారని అన్నారు.మొదటి రోజు జస్టిస్ చంద్రకుమార్, హేమలత కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ వంటి ప్రముఖులు ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు.పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి. చిట్టిబాబు, చిలకా చంద్రశేఖర్ మరియు ఇతర ప్రతినిధులు ఈ సభలను పర్యవేక్షిస్తారని తెలిపారు.

సభలో భాగంగా రెండో రోజు ప్రతినిధుల సభ జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

ముగింపు సభలో వివిధ ప్రజా సంఘాల నేతలు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ.కె. బాషా తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజాస్వామ్యవాదులను వారు కోరారు.ఈ కార్యక్రమంలో విరసం నాయకులు అరసవల్లి కృష్ణ,మంజరి లక్ష్మి(సి.ఎం.ఎస్),కె.కృష్ణ(కెఎన్పీఎస్),రివేరా(విరసం),కె.పోలారి (ఐఎఫ్టీయు) తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవ స్ఫూర్తి
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్  ఆకలితో ఉన్న చిన్నారులకు,...
By Rajini Kumari 2025-12-28 10:21:43 0 203
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి
పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి...
By Kothuru Murali 2026-04-16 17:23:48 0 131
Telangana
ఈశ్వర చారి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : 42% బి సి రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగం చేసిన ఈశ్వర చారి...
By Sidhu Maroju 2025-12-09 12:04:32 0 361
Andhra Pradesh
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొన సాగించాలని తహసీల్దార్ పార్థసారథి అన్నారు. మంగళవారం అంబేద్కర్...
By Kiran Kumar 2026-04-14 21:31:13 0 388
Andhra Pradesh
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు....
By Kothuru Murali 2026-04-03 09:47:38 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com