మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్యకరమైన ప్రవర్తన కేసుకు సిద్ధమైన పోలీసులు

0
166

మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసుకు సిద్ధమైన పోలీసులు

 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను బాలిక రెండు రోజుల తర్వాత తన తల్లికి చెప్పడంతో విషయం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మచిలీపట్నం నిజాంపేట ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై ఇంటి యజమాని అల్లుడు కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు సమాచారం. బాలికను మాయ మాటలతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే బాలిక అతడి చెర నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని బాలిక శుక్రవారం తన తల్లికి వివరించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

తల్లి వెంటనే చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది....
By Pagadala Venkateswar 2026-02-18 06:56:41 0 187
SURAKSHA
స్పందన కార్యక్రమం - ప్రజా సమస్యల పరిష్కారం
ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే 'స్పందన' కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను...
By Kalaga Sailaja 2026-06-29 07:31:21 0 95
Haryana
Haryana's Water Conservation and Irrigation Progress
Haryana is prioritizing water conservation and irrigation infrastructure development to ensure...
By Fathima Safa 2026-06-23 11:42:00 0 137
SURAKSHA
Surendra Singh Yadav IPS: A Leader Shaping Modern Policing
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to public safety, technology-driven...
By Kalaga Sailaja 2026-07-22 10:55:55 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com