ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం

0
260

పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –

          ఇంద్రకీలాద్రి పై ప్రతినెల శుద్ధ షష్టిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగే కళ్యాణము మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనా నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

      ఈ రోజు ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కల్యాణము మరియు స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అర్చన పూజలు నిర్వహించారు, స్వామి వారి కార్యక్రమమును మహామఁడపము 7 వ అఁతస్తు నఁదు ఏర్పాటు చేసిన పూజను తిలకిఁచిన భక్తులు స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

         ఆలయ కార్య నిర్వహణ అధికారి గారు మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రి పై ప్రతినెల శుద్ధ షష్టిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగే కళ్యాణము మరియు ప్రత్యేక పూజలు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని అన్నారు. వివాహం మరియు సంతానం: వివాహం లేదా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రేయస్సు: మంచి ఆరోగ్యం, విజయం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుందని భక్తులు స్వామి వారి ఆశీస్సులు పొందడానికి నెలకు ఒకసారి జరిగే సేవలొ అనగాఈ పూజలో ఉభయ రుసుము రూ.1,116/- ల టిక్కెట్టు పై శ్రీ స్వామి వారి సేవలొ పాల్గొనడం ఎంతో మంచిదని సూచించారు.

ఈ పూజా కార్యక్రమం ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆలయ అర్చకులు మరియు సిబ్బంది సహకారంతో విశేషముగా పూజ కార్యక్రమము జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన...
By Chennaiah Kati 2026-07-03 17:00:27 0 124
SURAKSHA
Ajay Kumar Sharma IPS: Legacy of Police Leadership
A 1989-batch Madhya Pradesh cadre IPS officer whose decades of service reflect professionalism,...
By Lokeshwari Panthadi 2026-08-01 10:07:23 0 241
SURAKSHA
The Architect of Trust: The Inspiring Journey of IPS P. Parameshwar Reddy
Sub Headline: From the rustic fields of a remote village to the frontlines of leadership,...
By Kalaga Sailaja 2026-07-14 05:48:48 0 125
Andhra Pradesh
పులివెందుల ZPTC ఉప ఎన్నికలు – MLA ఎన్నికల కంటే కఠినమైన భద్రత
ఆంధ్రప్రదేశ్‌ - పులివెందులలో జరగనున్న జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ (ZPTC) ఉప...
By Bharat Aawaz 2025-08-11 18:22:55 0 811
Telangana
సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల...
By Gujile Ramu 2026-04-27 23:47:02 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com