కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగ వర్ధంతి కార్యక్రమం

0
253

*వీ ఎం రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం*

 

*కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగా వర్ధంతి కార్యక్రమం*

 

*మంగళగిరి:*

బడుగు, బలహీన వర్గాల నాయకుడు దివంగత స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని కాపు సంఘం నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి కాపు సంఘం నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహన రంగా చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు అండగా తాము నిలబడతామని తెలిపారు. జై కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాపు సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహా నాయకుడు అని తెలిపారు. పార్టీలకతీతంగా వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో, జనసేన నాయకులు అనిల్ బాబు, శివ నాగేంద్రం, నారిశెట్టి చంద్రశేఖర్, కాపు సంఘం నాయకులు తులం సాంబశివరావు, ఇండ్ల సత్యం, బత్తుల గణపతి, యుగంధర్, పోతన చిరంజీవి, నాగేశ్వరరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Yogesh Deshmukh IPS: Leading with Integrity and Justice
A distinguished 1995-batch IPS officer of the Madhya Pradesh cadre, Yogesh Deshmukh has earned a...
By Lokeshwari Panthadi 2026-08-01 11:18:34 0 278
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు
పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-03-08 08:17:44 0 386
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ కి అవార్డు రావడం సంతోషం మంత్రి మండిపల్లి
రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి డిజిటల్...
By Benguluri Madhubabu 2026-01-17 07:39:00 0 341
Andhra Pradesh
లోక్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*విజయవాడ*   లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు    రాష్ట్ర...
By Rajini Kumari 2026-04-25 12:02:29 0 192
Andhra Pradesh
Madanapalle: కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మదనపల్లె, తిరుపతి కేంద్రాల్లో ఐటీ హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్.
మదనపల్లె: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకుని కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్...
By Pagadala Venkateswar 2026-07-22 11:32:40 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com