కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *

0
261

*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *

*ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న మేకల చిన్న గోపి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 

కూటమి నాయకుల వేధింపులు తాళలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకల చిన్న గోపి కుటుంబ సభ్యులను నేడు వారి ఇంటికి వెళ్లి పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పరామర్శించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ మేకల గోపి మృతి చాలా బాధాకరం, గోపి కుటుంబానికి నంబూరు శంకరరావు ఆర్థిక సహాయం చేశారు పిల్లల చదువుకు మరియు పార్టీ తరుపున అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై కూటమి నాయకులు వేధింపులకు గురించేస్తున్నారన్నారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉండకుండా వేధింపులతో గ్రామం నుండి వెళ్లగొడుతున్నారని అన్నారు. రాజకీయం అంటే ప్రజలకు దగ్గర అవ్వలి కానీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు అని తెలిపారు. ఇప్పటికి అయిన పద్ధతి మార్చుకొని ప్రజా పాలన కొనసాగించాలని, నియోజకవర్గం అభివృద్ధి చేయాలనీ సూచించారు. వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు దైర్యం గా ఉండాలని, ఎటువంటి ఆగాయిత్యాలకు పాల్పడవద్దని, మళ్ళీ మన ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మనకు మంచి రోజులు వస్తాయని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు...
By Patan Khuddus 2026-05-11 09:37:27 0 776
Telangana
గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ...
By Avunoori Mahesh 2026-06-13 11:12:42 0 230
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్
శనివారం యాదమరిలో ఏపీ సీఎం చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు...
By Kothuru Murali 2026-05-23 14:10:18 0 123
Andhra Pradesh
విజయవాడ అమ్మవారి సన్నిధికి గోమాత రాక
"విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల నిమిత్తం...
By Rajini Kumari 2026-01-13 16:00:36 0 224
SURAKSHA
"Dr. Koshal Kumar Sharma IPS: Policing Ladakh with Vision"
A 2012-batch AGMUT IPS officer whose scientific background, disciplined leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-29 06:14:49 0 467
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com