అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం – అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు వేలాదిగా తరలిరండి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

0
276

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ...*

గురువారం అమరావతిలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని,దేశ రాజకీయాల్లో అజాత శత్రువుగా, మాజీ ప్రధాని గౌరవ శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి చేతుల మీదుగా అమరావతిలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అటువంటి మహానేత విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయటం రాష్ట్రానికి, అమరావతి భవిష్యత్తుకు ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో తాము అందరం కలిసి అమరావతికి తరలివెళ్తున్నామని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు, ఎన్డీయే కూటమి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలను స్మరించుకుంటూ, అమరావతి అభివృద్ధికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలవనుందని గళ్ళా మాధవి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
సినీ ప్రి ప్రియులంతాయులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ...
By Ponnala Srinivasrao 2026-03-16 10:41:26 0 283
SURAKSHA
విధి నిర్వహణలో అంకితభావం చాటుకుంటున్న తెలంగాణ పోలీసులు
 పండుగలు, పర్వదినాలు, మరియు ప్రత్యేక సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజల భద్రత కోసం...
By Kalaga Sailaja 2026-06-29 06:29:01 0 83
Telangana
ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి
టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ...
By Bheeshman King 2026-07-01 12:47:02 0 632
Telangana
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితులు అరెస్టు, మరో 9 మంది పరారీ
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి,...
By Bheeshman King 2026-01-16 13:16:34 0 743
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు...
By Kothuru Murali 2026-05-02 05:43:48 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com