క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం వేడుకలు ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలి!! కర్నూలు ఎస్పీ

0
247

కర్నూలు : పత్రికా ప్రకటన (24.12.2025)

కర్నూలు జిల్లా...

క్రిస్మస్,  న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి....

 కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

క్రిస్మస్, న్యూ ఇయర్  నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాల పై కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. 

డిసెంబర్ 31 వేడుకల్లో  ప్రధాన కూడళ్లలో డ్రంకెన్‌ డ్రైవ్‌, ఆకస్మిక తనిఖీలతోపాటు నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు.

వేడుకల నేపథ్యంలో కొందరు ఆకతాయిలు రోడ్ల  పై  హంగామా చేసి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదన్నారు.

న్యూ ఇయర్ స్వాగతపు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలన్నారు.

మద్యం సేవించి అత్యుత్సాహంతో హద్దు మీరి, చట్టపరమైన కష్టాలను తెచ్చుకోవద్దన్నారు. 

ఎవరైనా  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.  

వేడుకలను కుటుంబ సమేతంగా, ఇళ్లలో సంతోషంగా నిర్వహిం చుకోవాలన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్‌, ర్యాష్‌ డ్రైవింగ్ , రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌,  రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సైలెన్సర్లు తీసి ద్విచక్ర వాహనాలు నడపడం చేస్తూ శబ్ద కాలుష్యం చేసే వారి పై కఠినంగా వ్యవహరించాలన్నారు.  

మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. 

ద్విచక్ర వాహనాలు నడిపే  యువకులకు హెల్మెట్ లేకుండా  బయటకు పంపించరాదని, లైసెన్సులు లేని మైనర్లకు వాహనాలు ఇచ్చి బయటకు పంపించి   తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దన్నారు.

రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు ప్రమాదాల బారిన పడవద్దన్నారు.

ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు హాస్టల్స్ లలో ఉంటున్న విద్యార్దుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పోలీసు అధికారులకు, జిల్లా ప్రజలకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు  క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రజలు ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న _ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు.
గుంటూరు,చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్...
By John Baji 2026-01-22 11:13:40 0 227
Entertainment
Singer Asha bhosle expired
ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణం పట్ల...
By G k Nookala 2026-04-12 13:34:37 0 137
Bharat Aawaz
కలం Vs. కవాతు (The Pen Vs. The March)
కలం Vs. కవాతు (The Pen Vs. The March) జర్నలిజం యొక్క స్వర్ణ సూత్రం 'నిష్పాక్షికత' అని మనకు...
By Bharat Aawaz 2025-07-08 18:01:28 0 1K
Andhra Pradesh
అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-04-13 05:35:14 0 108
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ
*తాడేపల్లి:*     *మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-24 08:30:05 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com