నగరపాలక సంస్థ గుంటూరు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను క్లియర్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది

0
360

నగర పాలక సంస్థ, గుంటూరు తేది: 24-12-2025 గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం కల్గిస్తూ, ప్రమాదాలకు కారణంగా ఉంటున్నఆవులను, ఎద్దులను 3 బృందాల ద్వారా గోశాలకు తరలించడం జరుగుతుందని, తరలించిన వాటిని ఎట్టి పరిస్తితుల్లో తిరిగి ఇవ్వబడవని, తరలింపుని అడ్డుకుంటే పోలీసు కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్ ప్రాంతాల్లో రోడ్ల మీద ఉన్న ఆవులను గోశాలకు తరలింపులో కమిషనర్ నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల మీద ఆవులు విచ్చలవిడిగా వదులుతున్నారని, దాని వలన రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆవుల యజమానులకు రోడ్ల మీదకు వదలవద్దని తెలిపినా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ముద్రలు ఉన్న, పెంపుడు ఆవులైనా రోడ్ మీదకు వస్తే జిఎంసి గోశాలకు తరలిస్తామన్నారు. తరలించిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. ఆవులను పట్టుకోవడానికి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, బృందాలలో పోలీసులు కూడా ఉంటారన్నారు. ఆవులను పట్టుకోవడంను వీడియో రికార్డింగ్ చేస్తామని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిఎంసి గోశాలలో కూడా అదనపు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, సిబ్బందిని షిఫ్ట్ ల వారీగా పెంచాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. గోశాలని ప్రజారోగ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తాము కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తామని తెలిపారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఎస్ అయూబ్ ఖాన్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీఎస్ఏహెచ్పిసి సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న నియామకం
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యుడిగా తనను...
By Benguluri Madhubabu 2026-06-26 13:59:52 0 93
SURAKSHA
Shield of Courage: The Inspiring Journey of Kanta Jangid
Excellence at the Helm: The Inspiring Story of Smt. Kanta Jangid, IPS: Breaking glass ceilings...
By Kalaga Sailaja 2026-07-22 06:53:34 0 29
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలువురి రౌడీషీటర్ల బైండోవర్.|
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్....
By Sidhu Maroju 2025-10-27 15:38:21 0 276
Andhra Pradesh
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.
  ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్  Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-20 03:46:25 0 84
SURAKSHA
NATIONAL ROAD SAFETY UPDATE 2025: PROJECTIONS INDICATE CRITICAL NEED FOR BEHAVIORAL CHANGE AMID RISING HIGHWAY FATALITIES
  December 25, 2025 — As the calendar year 2025 draws to a close, preliminary data...
By Venugopal Gopal 2025-12-25 01:49:12 0 594
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com