ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.

0
118

 

ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్

 Andhra

AP Government Releases 919 Crore for NTR Vaidya Seva Private Hospital Dues

నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేశామన్న సత్యకుమార్

785 ప్రైవేట్ ఆసుపత్రులకు నిధులు అందాయని విడుదల

ఇప్పటి వరకు మొత్తం రూ. 5,556 కోట్లు విడుదల చేశామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవల బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం ప్రభుత్వం రూ. 919.13 కోట్లను విడుదల చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 

 

ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానంలో భాగంగా ఈ నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన వివరించారు. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 785 ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ నిధులు అందాయని తెలిపారు. 

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం రూ. 5,556 కోట్లను చెల్లించామని, బకాయిల చెల్లింపుల హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన నివేదికను ట్రస్టు సీఈఓ చక్రధరబాబు మంత్రికి అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:31:31 0 408
Andhra Pradesh
టీడీపీ ఆవిర్భావ వేడుకల జయప్రదానికి పిలుపు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతి నుంచి వీడియో...
By Boiena Rajesh 2026-03-28 13:46:59 0 288
Andhra Pradesh
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ.
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ 28-02-2026...
By Pagadala Venkateswar 2026-02-28 08:26:40 0 192
SURAKSHA
Muttimbaku Abhishikth Kishore IAS: Young Leader, Big Vision
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer whose leadership in district...
By Lokeshwari Panthadi 2026-07-16 10:26:34 0 160
Telangana
రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి
రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి...
By Pindikura Mahesh 2026-06-07 08:09:55 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com