ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన గుంటూరు కలెక్టర్ మరియు ఎస్పీ

0
247

 *ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్.పి* గుంటూరు, డిసెంబరు 24 : తుళ్లూరు మండలం వెంకటపాలెంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పరిశీలించారు. వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా అటల్ స్మృతి వనంను ప్రారంభించనున్నారు. స్మృతి వనంలో అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, సత్య కుమార్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.డి.ఎ అదనపు కమిషనర్ భరత్ తేజ, అదనపు ఎస్పీలు హనుమంతు, ఏ.టి.వి రవి కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, రహదారులు భవనాలు శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, తహసిల్దార్ హరి బాబు, సి.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం
దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడా వికాస...
By Chennaiah Kati 2026-07-22 15:43:51 0 27
Andhra Pradesh
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్ సంస్థ సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి...
By Chennaiah Kati 2026-06-20 17:44:46 0 61
Andhra Pradesh
పుంగనూరులో ఇలాంటి అలంకరణ చాలా అరుదు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక...
By Kothuru Murali 2026-03-10 15:45:27 0 151
Andhra Pradesh
విజయనగరంలో కేజీ చేపలు రూ.150
ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు బారులు తీరారు.విజయనగరంలో...
By Boiena Rajesh 2026-04-26 04:47:12 0 195
Telangana
కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు
మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని...
By Ponnala Srinivasrao 2026-04-01 11:39:06 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com