నేషనల్ కెమికల్ లాబొరేటరీ లో ఉద్యోగాలు!!

0
198

కర్నూలు : సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థల్లో ఒకటైన నేషనల్ కెమికల్ లాబొరేటరీ (ఎన్సీఎల్).. టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ/ ఐటీఐలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షలతో నియామకాలుంటాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైనవారికి రాత పరీక్ష ఉంటుంది.
1. టెక్నీషియన్
ఖాళీలు: 15
అర్హత: పదోతరగతి, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ / కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఫిట్టర్ / ప్లంబర్ / రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్ / ఎలక్ట్రీషియన్ / వైర్‌మెన్ / డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) ట్రేడ్‌తో 55 శాతం మార్కులతో ఐటీఐ పూర్తిచేయాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ. 19,900 - 63,200.
పరీక్ష: ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పదో తరగతి + ఐటీఐ స్థాయిలో ఉంటుంది. మూడు పేపర్లు ప్రత్యేక వ్యవధుల్లో ఉంటాయి.
పేపర్-1: మెంటల్ ఎబిలిటీ టెస్టు 50 ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నకు రెండు మార్కులు. రుణాతక మార్కులు లేవు. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జిమెంట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి 60 నిమిషాలు.
పేపర్-2: జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నల చొప్పున వస్తాయి. ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. వ్యవధి 30 నిమిషాలు.
పేపర్-3: సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 50 ఉంటాయి. ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. వ్యవధి 90 నిమిషాలు.
2. టెక్నికల్ అసిస్టెంట్
పోస్టులు: 19
అర్హత: కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / మెకానికల్ / సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌తో డిప్లొమా, రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో బీఎస్సీ, ఏడాది అనుభవం ఉండాలి. విద్యార్థుల డిగ్రీని 60 శాతంతో పూర్తిచేయాలి.
వేతన శ్రేణి: నెలకు రూ. 35,400 - 1,12,400.
పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్‌లలో 200 మార్కులకు ఉంటుంది. డిప్లొమా/ డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
పేపర్-1, పేపర్-2 టెక్నీషియన్ పరీక్ష మాదిరిగానే ఉంటాయి.
పేపర్-3: సబ్జెక్టు సంబంధిత 100 ప్రశ్నలకు 300 మార్కులు. ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
సన్నద్ధత
రెండు పోస్టులకు పేపర్-3లో సబ్జెక్టు సంబంధిత అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ముఖ్యాంశాలను అధ్యయనం చేసి పునశ్చరణ చేసుకుంటే ఇందులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
పేపర్-1లో ఉత్తీర్ణత కోసం వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
ప్రతి పేపర్‌కూ వేర్వేరు సమయాలు ఉన్నాయి. నిర్ణీత వ్యవధిలోగా సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.
రుణాత్మక మార్కుల కారణంగా తెలిసిన ప్రశ్నలకే జవాబులు రాయాలి.
వివరాలు
వయసు: 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ - ఎన్సీఎల్ కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అన్రిజర్వుడ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 500. మహిళలు / ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2026
వెబ్‌సైట్: https://recruit.ncl.res.in/

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal Expands Green Energy and Renewable Power in 2026
Himachal Pradesh is accelerating its transition toward clean and renewable energy by expanding...
By Fathima Safa 2026-07-06 07:05:42 0 61
Andhra Pradesh
ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత
ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి...
By Boya Dasthagiri 2026-04-20 11:33:56 0 208
Andhra Pradesh
తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో
*తాడేపల్లి*   *కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*  ...
By Rajini Kumari 2026-03-30 04:46:49 0 193
Andhra Pradesh
దేవినేని అవినాష్ కామెంట్స్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు
*దేవినేని అవినాష్ కామెంట్స్* *NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు*     ప్రభుత్వ మెడికల్...
By Rajini Kumari 2025-12-13 09:26:17 0 251
SURAKSHA
Ex-WB Cops: Cyber Crime Warriors After Retirement
Retired WB police officers have become cyber crime fighters for society. They conduct awareness...
By Kalaga Sailaja 2026-07-03 12:56:15 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com