NTR జిల్లా పల్స్ పోలియో కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీశ

0
228

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 21, 2025*

 

*రెండు చిన్న చుక్క‌ల‌తో ఆరోగ్య భ‌విత‌*

- *ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

రెండు చిన్న పోలియో చుక్క‌లు ఆరోగ్య‌క‌ర‌మైన భ‌విత‌కు బాట‌లు వేస్తాయ‌ని.. సుసంప‌న్న‌, ఆరోగ్య‌, ఆనంద‌క‌ర ఆంధ్రా ల‌క్ష్యాల సాద‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదివారం న‌గ‌రంలోని చుండూరు వెంక‌ట‌రెడ్డి న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల వ‌ద్ద పోలియో బూత్‌ను సంద‌ర్శించారు. చిన్నారుల‌కు స్వ‌యంగా పోలియో చుక్క‌లు వేశారు. రోటరీ నగర్, హెచ్ బీ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌ను చేరుకునే క్ర‌మంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి స‌మ‌ష్టి కృషి జ‌రుగుతోంద‌ని.. పోలియోను అంత‌మొందించిన‌ప్ప‌టికీ అప్ర‌మ‌త్తంగా ఉంటూ అయిదేళ్ల‌లోపు చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. త‌ల్లిదండ్రులు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా త‌ప్ప‌కుండా చిన్నారుల‌కు పోలియో డ్రాప్స్ వేయించాల‌ని తెలిపారు. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి స‌ర్వే ద్వారా కూడా మిగిలిపోయిన చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయడం జ‌రుగుతుంద‌న్నారు.  

వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మునిసిప‌ల్ త‌దిత‌ర శాఖ‌ల భాగ‌స్వామ్యంతో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. బ‌స్ స్టేష‌న్లు, రైల్వే స్టేష‌న్‌, ఆసుప‌త్రులు, ఆరోగ్య కేంద్రాలు తదిత‌ర చోట్ల కూడా పాయింట్లు ఏర్పాటు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తోపాటు డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీఐవో డా.శ‌ర‌త్‌బాబు, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి కూడా ప‌ల్స్ పోలియో కార్య‌క్రమంలో పాల్గొన్నారు. కార్య‌క్ర‌మ విజ‌య‌వంతానికి అధికారులు, సిబ్బందికి సూచ‌న‌లు చేశారు.

(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
India and Japan Push Forward 'Smart Island' Plan for Andaman & Nicoba
In early June, India and Japan strengthened their partnership to develop the Andaman &...
By Bharat Aawaz 2025-07-17 08:37:30 0 1K
Andhra Pradesh
కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం   మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి,...
By Rajini Kumari 2026-05-07 08:22:59 0 175
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో సోమవారం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల మస్తాన్ అనే...
By Kothuru Murali 2026-03-31 05:16:56 0 234
Telangana
ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్;
కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి...
By Mittapelli Saketh 2026-01-28 09:01:04 0 591
Andhra Pradesh
ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.
మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్  పానకాల...
By Pagadala Venkateswar 2026-06-25 06:17:48 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com