ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి

0
347

ఎస్ఐ రాజు కుమార్

 

 

మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడ ఎస్ఐ రాజు కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు....

 

*ఈ సందర్భంగా ఎస్ఐ రాజు కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల సమయంలో భయాందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ రోజువారీ అధ్యయన ప్రణాళిక రూపొందించుకోవాలని, అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు*.

 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఉపాధ్యాయులను సంప్రదించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుదాం
*ప్రెస్ నోట్*   *6-6-26*   *విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం*  ...
By Rajini Kumari 2026-06-06 11:08:45 0 356
Andhra Pradesh
పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్
పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు...
By Kothuru Murali 2026-04-23 15:14:44 0 150
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా మే డే వేడుకలు.
మదనపల్లెలో అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా...
By Pagadala Venkateswar 2026-05-02 03:54:39 0 146
Andhra Pradesh
Adani Group: ఏపీకి అదానీ-ఎంబ్రాయెర్ విమానాల ఫ్యాక్టరీ? అనంతపురంపై ప్రభుత్వ దృష్టి.
అదానీ, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయెర్ మధ్య విమానాల తయారీకి ఒప్పందం ఈ ప్రాజెక్టును ఏపీకి తెచ్చేందుకు...
By Pagadala Venkateswar 2026-01-28 06:48:14 0 176
Andhra Pradesh
పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి
సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం...
By Kothuru Murali 2026-04-26 10:45:51 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com