ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు

0
236

*ప్రవేట్ పాఠశాలల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం*

 

▪️*ఈనెలాఖరులోగా ఆన్లైన్లో చేసుకోవాలన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు*

 

రాష్ట్రంలో రానున్న 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలలను ప్రారంభించేందుకు అనుమతి కోసం ఈనెల 31లోగా cse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయ్ రామరాజు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల ప్రారంభానికి దరఖాస్తు చేసుకున్నవారికి నిబంధనలననుసరించి అనుమతి మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఇచ్చిన తర్వాత పాఠశాల ప్రారంభానికి కావాల్సిన సదుపాయాలు, గుర్తింపు తీసుకోవడానికి తగు సమయం అవసరమవుతుందని ఈ నేపథ్యంలో ఆసక్తిగలవారు ఈనెలాఖరులోగా ఆన్లైన్లో ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. అనుమతి ప్రక్రియలో భాగంగా ఎంఈవో, డీఈవోలు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ ప్రాంతంలో పాఠశాల అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించి నివేదిక అంజేయాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో పాఠశాల అవసరాల ప్రకారం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.
    Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన...
By Pagadala Venkateswar 2026-03-01 05:03:09 0 196
Andhra Pradesh
రాయచోటి లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 5 లక్షల రూపాయలు సహకారం అందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5...
By Benguluri Madhubabu 2026-02-24 14:51:36 0 261
Telangana
పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్...
By Sidhu Maroju 2025-09-01 13:13:24 0 462
SURAKSHA
Ilango R., IPS: A Dedicated Leader in Public-Centric Policing
Ilango R., IPS – Serving the Nation with Integrity and Courage The Journey Begins "The...
By Fathima Safa 2026-07-10 07:25:10 0 127
Telangana
ఆసిఫాబాద్ హైవే దిగ్బంధం. వట్టివాగు నీటి కోసం రైతులతో కలిసి బైఠాయించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
 🎤(భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ (బురుగుడ): వట్టివాగు ప్రాజెక్టు కాలువలకు సాగునీరు విడుదల...
By Chunarkar Jagadeesh 2026-08-17 15:17:31 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com