జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|

0
245

హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో.

వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి కబురు.

టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటన.

జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. 

శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో మంత్రి ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని అయితే వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని ప్రకటించారు.

 జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు.

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం నాయకులను, సభ్యులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sidhumaroju   Accreditation cards go

Search
Categories
Read More
Assam
Assam’s GI Products Go Global: Tezpur Litchi Hits Dubai
Following the successful direct export of GI-tagged Tezpur Litchi to Dubai, Assam's Department of...
By Lokeshwari Panthadi 2026-06-26 13:20:17 0 150
Andhra Pradesh
సోమల మండలంలో యోగ వారోత్సవాలు ప్రారంభం
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, దుర్గం కొండ వద్ద ఆదివారం యోగా కార్యక్రమం, ట్రెక్కింగ్ నిర్వహించారు....
By Kothuru Murali 2026-06-08 14:24:14 0 113
Telangana
"సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :ఆల్వాల్ పరిధిలోని కనాజిగూడ ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2026-06-17 12:28:55 0 126
Andhra Pradesh
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం.
ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-05-11 06:34:44 0 126
BMA
Airtight Reporting: The Power of Deep Fact-Checking
In the era of rapid digital publishing, basic fact-checking is often sacrificed for speed,...
By JoinBMA 2026-08-24 05:59:35 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com