S C C సంక్షేమం అభివృద్ధికి అదనంగా 150 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం

0
252

పత్రికా ప్రకటన.

 

*ఏసు ప్రభువు త్యాగం, ప్రేమ, కరుణ బోధనలు ద్వారా విశ్వమానవాళికి చక్కని శాంతిమార్గం వేసారు*.

 

*యస్ సి సంక్షేమం, అభివృద్ధికి అదనంగా రూ 150 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం*.

 

*రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి* ... 

 

ఏలూరు/నూజివీడు: డిసెంబరు 19: నూజివీడు మంత్రివర్యులు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్టమస్ కు ప్రత్యేక అతిథిగా హాజరై ఫాదర్స్, మత పెద్దలకు, సోదర, సోదరీ మణులకు మరియు కూటమి నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి క్రిస్టమస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మొదటిగా మంత్రికి ఘనంగా స్వాగతం పలికి చర్చి ఫాదర్స్, సిస్టర్స్ వాక్యం చదివిన అనంతరం కేక్ ను కట్ చేసి అందరికీ మంత్రి అందజేశారు. స్నేహ రైట్స్ బి.నగేష్ రావు ఆధ్వర్యంలో 30 మంది నిరుపేదలకు 17 రకాలు నిత్యవసర సరుకులను మంత్రి అందజేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా క్రిస్టియన్ సోదరులు అభివృద్ధి, సంక్షేమానికి రూ 150 కోట్లు అదనంగా కేటాయించామని అన్నారు. జెరూసలేము యాత్రకు, విదేశీ విద్యను అభ్యచించడానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించామని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అందుకు కావలసిన నావంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. క్రైస్తవులు కుటుంబాలు మంచి ప్రేమ, ఆప్యాయతలు కలవారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేవుడు దృష్టిలో మానవులంతా సమానం అని, ఎవరికి కావలసిన అవసరాలు వారికి పుట్టించినప్పుడే వారికి సమృద్ధిగా ఇస్తారని తెలిపారు. దేవుడి దయతో మాత్రమే ఈ పదవులు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు. దేవుని మార్గంలో నడిస్తే అందరూ ఆరోగ్యంగా, అభివృద్ధి చెందుతారని అన్నారు. అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలని మత పెద్దలను, ఫాదర్స్ లను కోరారు. గతంలో 255 క్రైస్తవ మందిరాలకు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం కూడా మన ప్రజా ప్రభుత్వమేనని తెలిపారు. గతంలో క్రిస్టియన్ సోదరులకు అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని తెలిపారు. ప్రభువు ఆశీస్సులతో రాష్ట్రం, నియోజకవర్గం అంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని, అందరి జీవితాల్లో చీకటి తొలగిపోయి వెలుగులు నింపాలని, విజయాలు సిద్ధించాలని ఏసు ప్రభువును కోరానని అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు, సిస్టర్స్, చర్చి పెద్దలు ఇళయరాజా, రమేష్, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, క్రైస్తవ సోదర, సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు. 

...........................................................

జిల్లా సమాచార శాఖ, ఏలూరు నుండి జారీ చేయడమైనది.

Search
Categories
Read More
SURAKSHA
ఆంధ్రప్రదేశ్ పోలీసుల సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి:
సైబర్ క్రైమ్ అవగాహన - తిరుపతి: తిరుపతిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఏపీ సైబర్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన...
By Kalaga Sailaja 2026-07-01 05:37:59 0 94
Andhra Pradesh
విజయ పాలదర పెంపు లీటర్కు రెండు రూపాయలు
*విజయ పాల ధరలు పెంపు...లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై...
By Rajini Kumari 2026-04-02 16:40:00 0 212
Maharashtra
Maharashtra Strengthens Agriculture and Farmer Welfare
Maharashtra continues to prioritize agriculture and farmer welfare through initiatives that...
By Fathima Safa 2026-07-06 08:21:23 0 197
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 359
Telangana
మే 29న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు గవర్నర్ రాక
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి...
By Chunarkar Jagadeesh 2026-05-28 17:25:33 0 453
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com