జాతీయ రోలర్ స్కేటింగ్లో విశాఖ అమ్మాయి బంగారు పతకం

0
29

విజయవాడ 

(17-12-2025)

 

*స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు* 

 

*జాతీయ రోలర్ స్కేటింగ్‌లో విశాఖ అమ్మాయికి బంగారు పతకం* 

 

విశాఖ వేదికగా ఈ నెల 7 నుంచి 8 వరకు నిర్వహించిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో విశాఖపట్నానికి చెందిన స్కేటర్ V.అమృత బంగారు పతకం సాధించడం అభినందనీయమని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అమృతను అభినందించారు.

 

రోలర్ డౌన్ హిల్ ఆల్పైన్ విభాగంలో అమృత బంగారు, కాంస్య పతకాలు సాధించడం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
బోనాల పండుగ పంపిణీలో చెక్కుల వివాదం- కాలనీవాసులపై అయినా కేసులను పున పరిశీలించండి; ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ...
By Sidhu Maroju 2025-11-18 11:18:46 0 38
Andhra Pradesh
పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు
మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు...
By mahaboob basha 2025-10-06 13:30:53 0 147
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com