పి పి పి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు

0
11

*పత్రికా ప్రకటన*

 

అమరావతి,

16.12.25.

 

• *పిపిపి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు : రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి*

 

• *వైద్య విద్య ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో.. ఎక్కువ మందికి మెడికల్ విద్య అందించాలంటే పీపీపీ విధానం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసిన కేంద్రం*

 

• *పీపీపీ విధానంలో ఒక్కో మెడికల్ కాలేజీలో 250 యూజీ సీట్లు పెంచుకునే వెసులుబాటు ఉందని తన నివేదికలో స్పష్టం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ* 

 

• *రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మెడికల్ కాలేజీలపై వైసీపీ విమర్శలు* 

 

• *కేవలం తమ రాజకీయ ఉనికి కోసమే ప్రజలను రెచ్చగొట్టి నిరసనలు, ఉద్యమాలు పేరిట ఊదరగొడుతున్నారు..*

 

• *కోటి సంతకాల సేకరణ నాటకమంతా ఒక బూటకం*

 

• *పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై హైకోర్టు సమర్థించినా ప్రతిపక్ష నేతల్లో మార్పు కనిపించకపోవడం దురదృష్టం..*

 

 

• *నిధుల కొరతతో సుధీర్ఘ కాలం పాటు నిర్మాణాలు కొనసాగే దుస్థితికి.. చరమగీతం పాడాలనే చంద్రబాబు నేతృత్వంలో పీపీపీపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం..*

 

• *పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి.. ప్రవేటీకరణకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకుండా ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోంది..*

 

• *పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఎక్కడైనా చర్చకు కూటమి ప్రభుత్వం సిద్ధం*

 

• *పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టడం ద్వారా వైద్య విద్య మెరుగుపడటంతో, నిరుపేదలకు మెరుగైన వైద్యం సాయం అందించగలం*

 

• *పీపీపీ విధానంలో అదనంగా 220 సీట్లు రాష్ట్రంలో పెరగడంతో పాటు, 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలో పెరుగుతాయి..*

 

• *వైసీపీ పాలనలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ. 8400 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. కేవలం రూ. 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారు*

 

• *మెడికల్ కాలేజీ నిర్మాణాలకు సంబంధించిన నిధులు నాడు పక్కదోవ పట్టించి, నేడు రాజకీయ విమర్శలకు పాల్పడటం దుర్మార్గం..*

 

• *151 సీట్లతో ప్రజలు అధికారం కట్టబెడితే, 17 మెడికల్ కాలేజీలు నిర్మించలేని, మీరు నేడు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు..*

 

• *రాబోయే రెండేళ్లలో కాలేజీ నిర్మాణాలు పూర్తి చేసి, రాష్ట్ర విద్యార్ధులకు అదనంగా 1750 సీట్లు పొందేందుకు వెసులుబాటు కల్పిస్తాం.*

 

• *పీపీపీ విధానంలో ప్రభుత్వమే వైద్య కళాశాలలు & ఆసుపత్రుల యాజమాన్యాన్ని కొనసాగిస్తుంది.. ప్రవేట్ భాగస్వామి కేవలం మౌలిక సదుపాయాల కల్పన & నిర్వహణలో సహాయం అందిస్తుంది.*

 

• *గత ఐదేళ్ల మీ అరాచక, అసమర్థ, అవినీతి, అర్ధరహిత పాలనకు.. నాడు మీ హాయాంలో అసంపూర్తిగా వదిలేసిన మెడికల్ కాలేజీల మొండి గోడలే సజీవ సాక్ష్యం.*

 

• *5 ఏళ్ల పాలనలో 5 మెడికల్ కాలేజీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయని జగన్ మోహన్ రెడ్డి అండ్ కో మాట్లాడటం విడ్డూరం*

 

• *ఐదేళ్లు సీఎం పదవిని వెలగబెట్టి.. మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేని అసమర్థ నేత జగన్*

 

• *సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే, మీరు చేస్తున్న నిరసనలకు కనీసం వైసీపీ కార్యకర్తల నుంచి కూడా స్పందన కరువైంది..*

 

• *ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తప్పులుంటే ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం బాధ్యత గల ప్రతిపక్షంపై ఉంటుంది*

 

• *అది మరిచి కేవలం మొక్కుబడిగా కోటి సంతకాలు అంటూ డ్రామాలాడుతూ, ప్రజలను పక్కదోవ పట్టించడం మీ రాజకీయ చిత్తశుద్ధికి నిదర్శనం*

 

• *చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం.. నేడు అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ, దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోంది..*

 

• *రాష్ట్రంలో సంక్షేమ – అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్న తీరు జీర్ణించుకోలేని వైసీపీ.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే కుటిల బుద్ధితో, ఇటువంటి పన్నాగాలకు పాల్పడుతోంది...*

 

• *విచ్చలవిడిగా అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల కుప్పగా వైసీపీ మార్చేసింది*

 

• *ఆర్ధికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చిన వైసీపీ నేతలు.. నేడు అప్పులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం*

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com