కర్నూలు జిల్లాలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమాలు

1
422

కర్నూలు : 

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో 

రాత్రి బస (పల్లె నిద్ర)  కార్యక్రమాలు నిర్వహిస్తున్న కర్నూలు  పోలీసులు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  గారి ఆదేశాల మేరకు కర్నూల్ పోలీసు అధికారులు ఆయా సమస్యాత్మక గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 6  గ్రామాలలో రాత్రి బస ( పల్లె నిద్ర) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

గ్రామస్తులతో మాట్లాడి  ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని,  ఎవరైనా గొడవలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాల జోలికెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

  డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మకూడదని, మహిళలు, బాలబాలికల పై జరిగే నేరాలు, సైబర్ మోసాల బారిన పడకూడదని,  అపరిచితుల కాల్స్ మరియు  లింకులు క్లిక్ చేయరాదని, బ్యాంకు ఖాతాల ఓటిపిలు తెలియని ఎవరికి చెప్పకూడదని, రోడ్డు ప్రమాదాల గురించి  ప్రజలకు అవగాహన  చేస్తున్నారు. 

 ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. 

 రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు అవగాహన చేస్తున్నారు.

గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా  తమ వంతు భాద్యతగా  గ్రామాలలోని యువత, ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలియజేస్తున్నారు. 

ఈ కార్యక్రమాలలో పోలీసు అధికారులు, గ్రామాలలోని ప్రజలు యువత,  తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పవిత్రమైన తిరుమల తిరుపతి పై మచ్చగా బి.ఆర్ నాయుడు
ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహ జ్వాలలు  ఎమ్మిగనూరులో జరిగిన భారీ నిరసన...
By Boya Dasthagiri 2026-04-04 08:18:11 0 202
SURAKSHA
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు చేపట్టిన కమ్యూనిటీ కిచెన్ సేవా కార్యక్రమ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు ప్రతిరోజూ 1,000 మంది నిరుపేదలకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు....
By Kalaga Sailaja 2026-07-01 05:55:00 0 51
SURAKSHA
​. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రచారం
మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు నిన్న పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన...
By Kalaga Sailaja 2026-06-27 06:25:54 0 41
Andhra Pradesh
ఆయుష్ ఆసుపత్రి భవనం భూమీ పూజ
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోన్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి...
By Mobbu Venkatramana 2026-01-29 17:11:07 0 563
Andhra Pradesh
పేకాట స్థావరం పై దాడి....నలుగురు అరెస్ట్.
మదనపల్లె మండలంలోని కాట్లాటపల్లి రోడ్డులో పేకాట ఆడుతున్న నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్టు...
By Pagadala Venkateswar 2026-05-25 04:33:55 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com