ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
327

*కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తుంది: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*ఎన్టీఆర్ స్టేడియంలో... ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే*

 

*పలు క్రీడల్లో స్వయంగా పాల్గొని... ఉపాధ్యాయులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే*

 

*నిత్యం ఒత్తిడిలో ఉండే వారికి.... క్రీడలే ఆట విడుపు...*

 

*గుడివాడలో క్రీడల అభ్యున్నతికి తాను అన్ని విధాలుగా సహకరిస్తా...*

 

గుడివాడ డిసెంబర్ 13: రాష్ట్రంలో క్రీడల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. 

 

గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు.... గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు కరచాలనం అందిస్తూ పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే, పలు క్రీడల్లో స్వయంగా పాల్గొని వారిని ఉత్సాహపరిచారు.

 

అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.... చదువులో, ఆటోలో నిత్యం విద్యార్థులను ప్రోత్సహించే ఉపాధ్యాయులు, నేడు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 

 

ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో, క్రీడల్లో పాల్గొనడం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వ వికాసం , మానసిక ప్రశాంతత కలగడంతో పాటు అనేక రుగ్మతలు దూరమవుతాయన్నారు. ఈ విషయాలను ఉపాధ్యాయులు బాల్యంలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

 

వివిధ రంగాల్లో నిత్యం ఒత్తిడిలో ఉండేవారు క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆటవిడుపు కలుగుతుందని పేర్కొన్న ఎమ్మెల్యే రాము గుడివాడలో క్రీడల అభ్యున్నతికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు

 

ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబశివరావు, ఏసుపాదం, నిమ్మగడ్డ సత్యసాయి, కడియల గణేష్, ఆదినారాయణ, దేవాది నాగేశ్వరరావు, నిరంజన్, సబ్ డివిజన్ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, గన్నవరం, ఉంగుటూరు, పెదపారుపూడి, బావులపాడు, మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక
తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ...
By Bharat Aawaz 2025-10-15 08:26:20 0 1K
Tamilnadu
Tamil Nadu tragedy: 20 injured as sewage tank explodes at factory in Cuddalore district
Cuddalore (Tamil Nadu): In a tragic incident, as many as 20 people sustained injuries after a...
By BMA ADMIN 2025-05-19 19:11:44 0 2K
BMA
Amnesty Report Warns of Dissent Criminalization in India
A mid-2026 human rights report jointly released by Amnesty International and the Civicus Monitor...
By JoinBMA 2026-08-19 06:02:45 0 167
Telangana
పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు యల్.బి.స్టేడియం హైదరాబాద్ లో జులై 4 న కాంగ్రెస్ పార్టీ మహాసభను విజయ వంతం చేద్దాం రండి.!!
   క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్,  అందులో భాగంగా.....
By Sidhu Maroju 2025-07-02 06:53:20 0 1K
Andhra Pradesh
దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం
నెహ్రు నగర్ వెంకటాద్రి పేటలోని, వృద్ధుల అనాధాశ్రమంలో, దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు...
By John Baji 2025-12-30 01:23:06 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com