పెంచికలపాడు విశ్వ భారతి హాస్పిటల్ నందు వైద్యం వికటించి బాలింత మృతి

0
101

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ బాలింత మృతి పై ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు గూడూరు మండలంలోని పెంచికలపాడు విశ్వ భారతి ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత వెంకటలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. సంఘటనకు సంబంధించి సి. బెళగల్ మండలంలోని కె సింగవరం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని రెండేళ్ల కిందట కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించారు. వెంకటలక్ష్మికి తొలి ప్రసవం కావడంతో పుట్టినిల్లు అయిన కె లింగవరం గ్రామానికి రావడం జరిగింది. రెండు రోజుల కిందట ప్రసాదం కొరకు పెంచికలపాడు లోని విశ్వ భారతి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లి చేర్పించారు. గురువారం వైద్యులు వెంకటలక్ష్మికి సిజేరియన్ చేయడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత వెంకటలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు మరో మారు ఆపరేషన్ నిర్వహించగా కోలుకోలేక మృతి చెందింది. తమ బిడ్డకు వైద్యులు సరైన వైద్యం చేయకపోవడం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు కుటుంబ సభ్యులకు దిగారు. వెంకటలక్ష్మి మృతిచెందరం పట్ల వైద్యుల నిర్లక్ష్యం ఉందంటూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ఇబ్బందితో ఆసుపత్రికి చేరుకొని వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే
BREAKING    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC ఛీఫ్    -...
By Rajini Kumari 2025-12-16 13:00:49 0 24
Manipur
फुँग्यार में मोदी दौरे से पहले BJP संकट, 43 सदस्य बाहर
मणिपुर के फुँग्यार विधानसभा क्षेत्र में #BJP को बड़ा झटका लग्यो है। प्रधानमंत्री मोदी के आगमन सै...
By Pooja Patil 2025-09-12 05:14:27 0 344
Andhra Pradesh
పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు
మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు...
By mahaboob basha 2025-10-06 13:30:53 0 145
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ 15-12-2025   ప్రచురణార్ధం   అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
By Rajini Kumari 2025-12-15 07:25:36 0 57
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com