కంటోన్మెంట్ సీఈఓ తో ఎంఎల్ఏ శ్రీగణేష్ భేటీ.|

0
98

సికింద్రాబాద్ :  కంటోన్మెంట్ బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేది ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కలిసి పలు విషయాలపై చర్చించారు.

ముఖ్యంగా బస్తీల పర్యటన సందర్భంగా తన దృష్టికి ప్రజలు తీసుకువచ్చిన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ఈనెల 10 వ తేదీన నిర్వహించనున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో CEO గారితో పాటు బోర్డు అధికారులందరూ పాల్గొని ప్రజలు అందించే వినతులను స్వీకరించి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు .

అలాగే నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడంతో CEO గారు తప్పకుండా ఎమ్మెల్యే  తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని విషయాలపై దృష్టి సారిస్తానని, కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో అందరం తప్పకుండా పాల్గొంటామని చెప్పారు.

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com