ఆటోలు మర్చిపోయిన బంగారాన్ని గంటల వ్యవధిలోనే బాధితులకు అందజేసిన పోలీసులు.|

0
243

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శనివారం నాడు, ఆంధ్ర లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి కి గృహప్రవేశం నిమిత్తం వచ్చిన షేక్ సన, తిరుగు ప్రయాణం చేద్దామని ట్రైన్ కోసం సఫీల్ గూడ వెళ్లారు. అక్కడ వారికి ట్రైన్ మిస్ అవ్వడంతో  బొల్లారం తుర్కపల్లి కి ఆటోలో తిరుగుప్రయాణం అయ్యారు.

వారు తీసుకువెళ్లిన అన్ని లగేజ్ బ్యాగులు ఇంట్లోకి తెచ్చుకున్నారు కానీ ఒక లగేజ్ బ్యాగు అందులో 18 తులాల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న  బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు.

ఆదివారం నాడు బ్యాగులు చెక్ చేయగా అందులో ఒక బ్యాగ్ మిస్ అయిందని అందులోనే బంగారు నగలు ఉన్నాయని గమనించి వెంటనే  ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి ఆదివారం మధ్యాహ్నం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, అక్కడ విధుల్లో వున్న ఎస్సై చంద్రశేఖర్  సానుకూలంగా స్పందించి, ఎస్.హెచ్.ఓ అల్వాల్, మరియు డీఐ తిమ్మప్ప ఆదేశాలను అనుసరిస్తూ అట్టి ఆటోను మూడు గంటల వ్యవధిలోని ట్రేస్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు రప్పించారు.

బాధితురాలుకు సంబంధించిన బ్యాగును మరియు అందులో ఉన్న 18 తులాల విలువైన బంగారు నగలను సదరు బాధితురాలికి అప్పగించారు.

ఆటోలో మర్చిపోయిన అట్టి బ్యాగును,  బంగారు నగలను సదరు ఆటో డ్రైవర్ రాజేష్ బాధ్యతతో తిరిగి తెచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. 

అలాగే, ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని ఎస్సై చంద్రశేఖర్  సదురు మహిళలకు సూచించారు. తమకు సత్వరన్యాయం అందించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియచేసారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ...
By Rajini Kumari 2025-12-22 08:01:06 0 281
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో షబ్-ఎ-బరాత్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.
పుంగనూరు పట్టణంలో షబ్-ఎ-బరాత్ పండుగను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ...
By Kothuru Murali 2026-02-03 09:38:46 0 199
Telangana
మంచిర్యాల: మెడికల్ షాపులు బంద్
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ భాగంగా ప్రజలు తమకు సహకరించాలని మంచిర్యాల్ మెడికల్ డ్రాగెస్ట్...
By Bonagiri RaviShankar 2026-05-20 04:38:22 0 208
Telangana
ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల...
By Bheeshman King 2026-02-03 13:57:12 0 427
Andhra Pradesh
విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
Breaking...   విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన...
By Rajini Kumari 2026-01-11 09:50:13 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com