పదవి విరమణ అనేది వయసుకు మాత్రమే ప్రజా సేవకు కాదు - ఎమ్మెల్యే కెపి వివేకానంద్.|

0
44

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల డివిజన్ స్వాగత్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన కుత్బుల్లాపూర్ సర్కిల్ టాక్స్ ఇన్స్పెక్టర్ మెండు శ్రీనివాస్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్  ముఖ్యఅతిథిగా హాజరై మెండు శ్రీనివాస్ రెడ్డి - విజయలక్ష్మి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సుదీర్ఘ కాలం దాదాపు 40 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో వారి సేవలను అందించి ట్యాక్స్ ఇన్సెక్టర్ గా పదవీ విరమణ పొందిన శ్రీనివాస్ రెడ్డి  వయసురీత్యా మాత్రమే పదవీ విరమణ అని, ప్రజా సేవకు పదవి విరమణ ఉండదని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి  నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ - గాజుల రామారం సర్కిళ్ల ఉప కమిషనర్లు నర్సింహ, మల్లారెడ్డి, వివిధ విభాగాల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju   

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com