దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.|

0
31

*_నేటి తరానికి దీక్షా దివాస్ 

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ లోని తెలంగాణ భవన్ లో ఈనెల 29వ తేదీన నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమ విజయవంతంపై జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ తో పాటుగా మాజీ మంత్రి & ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు , మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి,  పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి  హాజరై దీక్షా దివాస్ కార్యక్రమ నిర్వహణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....

నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షత తొలగాలంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మార్గమని గుర్తించి తెలంగాణ రాష్ట్ర సాధనకై బిఆర్ఎస్ అధినేత,  కేసీఆర్  ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన 29, నవంబర్ 2009 రోజు "దీక్షా దివాస్" అని అన్నారు.

ఇంతటి ప్రాముఖ్యత ఉన్న "దీక్షా దివాస్" ప్రాముఖ్యతను నాయకులు, కార్యకర్తలు నేటి తరానికి తెలియజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఎవరి బిక్షో కాదని, అమరవీరుల త్యాగం, కేసీఆర్ గారి మొక్కవోని దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మరియు జీహెచ్ఎంసీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ధర్నా.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు...
By Sidhu Maroju 2025-11-29 10:26:39 0 54
Nagaland
CBI Raids in Nagaland–Tripura–Assam Academic Corruption Case
The CBI launched raids on July 12 in Nagaland (Lumami), Assam (Jorhat), and Tripura (Agartala),...
By Bharat Aawaz 2025-07-17 07:53:56 0 975
Telangana
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-17 11:05:03 0 119
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com