వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|

0
75

సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు వందేమాతర గీతాలాపన చేశారు. మాతృ భూమి పట్ల బంకిం చంద్ర చటర్జీకి ఉన్న ప్రేమ అంకిత భావాన్ని గుర్తు చేసుకుంటూ వందేమాతర గీతాన్ని సగర్వంగా ఆలాపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రిటీషర్ల నుండి దేశ స్వాతంత్రం కోసం ఆనాడు వందేమాతర గీతం ప్రేరేపించిన ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. వేలాదిమంది భారతీయుల త్యాగాల పునాదులపై సేవాతంత్ర సమరయోధుల సమీకృత పోరాటంతో స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. 

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com