తుపాను ప్రభావం తీవ్రం.. సీఎం ఆదేశాలతో చర్యలు వేగం |

0
22

మొంథా తుపాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. వరద బాధితుల సహాయానికి చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. SDRF బృందాలను తక్షణమే తరలించాలని, అవసరమైన పడవలు, హైడ్రా వద్ద ఉన్న సహాయక సామగ్రిని వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సూచించారు.

 

ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీటిని పంపించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించిన సీఎం, సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

 

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసిన సీఎం, గురువారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Search
Categories
Read More
BMA
📺 The Story of India's First TV News Broadcast
📺 The Story of India's First TV News Broadcast On September 15, 1959, history was made. From a...
By Media Facts & History 2025-04-28 12:05:54 0 3K
Telangana
సి. సి.రోడ్డు పనులకు శంకుస్థాపన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ సమీపంలో రూ.30.50...
By Sidhu Maroju 2025-06-07 09:18:04 0 1K
Andhra Pradesh
HYDRA కమిషనర్‌తో పవన్ సమావేశం: రెండు గంటల సమాలోచన |
మంగళగిరి కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరియు HYDRA కమిషనర్ రంగనాథ్‌...
By Akhil Midde 2025-10-25 04:39:46 0 83
Bharat Aawaz
Gas Leak in Anakapalli: How Citizens’ Rights Hold Power to Save Lives
In Recent Day in this month, a dangerous hydrogen sulfide (H₂S) gas leak at Sai Sreyas...
By Citizen Rights Council 2025-06-25 13:37:28 0 1K
Business
టాటా గ్రూప్‌లో అంతర్గత గందరగోళం తీవ్రతరం |
భారతదేశపు ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. సంస్థలోని...
By Bhuvaneswari Shanaga 2025-10-08 11:29:23 0 32
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com