క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ

0
114

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్!   ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్ ధోబీఘాట్ హాకీ గ్రౌండ్స్ లో ప్రఖ్యాత ప్రభోదకులు ఫాదర్ బెర్క్ మెన్స్  పాల్గొంటున్న, ఫాదర్ జార్జ్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్* ను శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ ఉజ్జీవ సభలకు ఆహ్వానం అందించిన పాస్టర్ లకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉజ్జీవ సభల విజయవంతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాస్టర్లు జూలియస్, అరుణ్,దినకరన్,ఆనంద్, సాల్మన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com