కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతినెలా 10 వ తేదీన "కంటోన్మెంట్" వాణి కార్యక్రమం ప్రారంభం.

1
363

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వార్డుల వారీగా ఒకే చోట విని, పరిష్కరించడానికి ప్రతినెలా 10 వ తేదీన ప్రారంభించనున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూడా పాల్గొనాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  బోర్డు సిఈఓ గారిని కలిసి కోరడంతో,మంచి కార్యక్రమం మొదలు పెడుతున్నారని, తప్పకుండా అధికారులం అందరం పాల్గొంటామని సిఇఓ చెప్పడం జరిగింది.అలాగే వర్షాకాలం నేపధ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ సిఇఓ కి సూచించారు.

      Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com