మున్సిపాలిటీలు సమగ్రామాభివృద్దే ద్యేయం: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

0
450

 

 

 మెదక్ జిల్లా: మెదక్.  అన్ని వార్డులలో పౌర సౌకర్యాలు పెంపొందించి మోడల్ మున్సిపాలిటీగా రూపొందించాలి మున్సిపాలిటీ పరిధిలో వార్డులు వారీగా  తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలపై తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మైనంపల్లి.  మెదక్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. వార్డులు వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. మున్సిపాలిటీలో వార్డులు వారిగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. అన్ని వార్డులలో పౌర సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మోడల్ మునిసిపాలిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆ దిశగా ముందుకు పోతున్నామన్నారు. అన్ని వార్డులలో డ్రైనేజీ, సిసి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   -sidhumaroju

Search
Categories
Read More
Kerala
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats were issued...
By BMA ADMIN 2025-05-20 05:18:29 0 2K
Telangana
శిల్పకళకు ఆధ్యుడు విశ్వకర్మ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
ఈరోజు 129 - సూరారం కాలనీ, డివిజన్ సూరారం గ్రామంలోని విశ్వకర్మ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన విరాట్...
By Sidhu Maroju 2025-06-15 11:11:49 0 1K
Andhra Pradesh
గోదావరి పుష్కరాలు !!
కర్నూలు :  2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం2027 జూన్ 26 నుంచి జులై...
By krishna Reddy 2025-12-13 03:43:37 0 148
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com