అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
462

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్ కాలనీలలో 39 లక్షల రూపాయలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ తో పాటు కలిసి పాల్గొన్నారు.పనుల ప్రారంభోత్సవం అనంతరం కాలనీల వాసులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా సమకూరుతున్న 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతంలో కనీవినీ అభివృద్ధి జరుగబోతుందని,అందరం సమన్వయం చేసుకొని కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  -sidhumaroju

Search
Categories
Read More
Telangana
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు :  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ...
By Sidhu Maroju 2025-11-27 08:01:04 0 40
Telangana
హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత డిగ్రీ విద్య: అంబేద్కర్ యూనివర్శిటీ కీలక నిర్ణయం
సరికొత్త అవకాశం: తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ...
By Triveni Yarragadda 2025-08-11 14:08:16 0 810
Andhra Pradesh
మహిళలకు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు, పెన్షన్ సౌకర్యం
కోడుమూరు లో ఘనంగా . ఉదయం నుండి ఎర్రజెండాలు పట్టణం పురవీధులలో కట్టి ,మహాసభ ప్రాంగణంలో ఎర్ర...
By mahaboob basha 2025-07-06 11:50:44 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com