28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..

0
797

ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్...

 

 

 పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ తాలూకా కార్యదర్శి టీ.ప్రతాప్, పట్టణ కార్యదర్శి అమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన 23వ తేదీ జరగబోయే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్నాయని ఈ మహాసభను ప్రజలందరూ కలిసి జయప్రదం చేయాలని వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని సితజయంత ఉత్సవాలు నిర్వహించుకున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ అని, ప్రజల పక్షాన నిరంతరాయంగా పోరాడుతూ ప్రజా సమస్య పరిష్కార వేదికగా మారుతున్న సిపిఐ పార్టీని అందరూ ఆదరించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేజీ రోడ్ అమాలి యూనియన్ నాయకులు చాంద్ బాషా, లల్లు, రఫీ, రజాక్ మియా, మున్సిపల్ ఏఐటీయూసీ నాయకులు ఏ. బిసన్న, నాగరాజు, అలీ షేర్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు గిర్నిబాయిలో ధర్నా.....
భారత్ అవాజ్ న్యూస్: 24 జూలై రోజున వరంగల్ జిల్లా గిర్ని బావి వద్ద దుగ్గొండి మండలం నీట్ పరీక్ష...
By Gujile Ramu 2026-07-24 11:12:20 0 197
Telangana
జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి: పర్యటన తేదీలో మార్పు
🎤(భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Chunarkar Jagadeesh 2026-05-25 02:24:54 0 534
Andhra Pradesh
పాలకుల నిర్లక్ష్యంతో వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్య.
పుంగనూరులో మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-09-17 05:01:05 0 37
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అకాల వర్షానికి నేలకొరిగిన బీరపంట
చౌడేపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం బీరపంటకు తీవ్ర నష్టం కలిగించింది. ఖాన్ సాబ్...
By Kothuru Murali 2026-03-20 06:15:29 0 194
Telangana
"పోలీస్ డ్యూటీ మీట్‌లో నవీన్ సత్తా… స్వర్ణం, కాంస్యం సాధన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజిగిరి జోన్‌లోని బేగంపేట్ డివిజన్ పరిధిలో...
By Sidhu Maroju 2026-04-10 13:45:35 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com