డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం. ||

0
877

డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం.

1.ఈ భూమిపై మరో జన్మ పొందటానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి.
2. నడవడానికి 2 సంవత్సరాలు.
3. స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు,
4. ఓటు హక్కు కై 18 సంవత్సరాలు,
5. ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు,
6. పెళ్ళికోసం 25నుండి 30 సంవత్సరాలు... ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్) వేచి ఉంటాము.

కానీ...
ఓవర్ టేక చేసే సమయంలో.. వాహనాలు నడుపుతున్నపుడు, 30 సెకన్లు కూడా ఆగలేక పోతున్నాము. తర్వాత తప్పిపోయి ఏమన్నా  యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో గంటలు, రోజులు, వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి..

కొన్ని సెకన్ల గడబిడ ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆలోచించండి. 

ముందు వెళ్ళేవారు వెళ్ళనీ.. వెనకాల హాయిగా వెళ్ళిపో.. దయచేసి సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ..హెల్మెట్ వాడుతూ.. వాహనాలు నియంత్రణలో ఉంచుకొని నడపండి. మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.

మీ కోసం, మీ యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు మీ ఇంటి వద్ద ఎదురు చూస్తుంటారని మరవకండి.. జాగ్రత్తగా వెళ్ళండి.. 

AP POLICE

Search
Categories
Read More
Business
ఆర్బీఐ గుడ్‌న్యూస్..? మళ్లీ భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు..
RBI Rate Cut: ఆర్బీఐ గత కొంత కాలంగా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుస...
By Kanva Prasad 2025-06-05 08:42:18 0 2K
Telangana
తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
 హైదరాబాద్:  తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్...
By Sidhu Maroju 2025-09-01 13:05:44 0 251
Telangana
Huge Re-Shuffle in Telangana IAS
By Bharat Aawaz 2025-06-12 17:03:35 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com