సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
651

 

 సికింద్రాబాద్/ కంటోన్మెంట్.  

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా గ్రౌండ్స్ లో నేడు మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి సారధ్యంలో నిర్వహిస్తున్న (Maa off season Telangana State Championship-) 2025 క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 30 సంవత్సరాలు పైబడిన పురుషులు మరియు మహిళలకు నిర్వహించే ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడలకు వయసుతో సంబంధం లేదని ఆరోగ్యవంతమైన జీవితానికి క్రీడలు ఆడటం చాలా మంచిదని దీనివల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక ఆరోగ్యం మరియు క్రీడా స్ఫూర్తి పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం పలు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన మెడల్స్ ప్రధానం చేశారు.ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

 

-సిద్దుమారోజు

Search
Categories
Read More
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 52
Goa
दिवर बेटावरील साप्तकोतेश्वर मंदिर स्थळी “कोटी-तीर्थ मार्ग” योजना
गोआ सरकारेन दिवर बेटावरील #साप्तकोतेश्वर_मंदिर जागेवर नवीन मंदिर आणि स्मारक उभारपाचो निर्णय घेतलो...
By Pooja Patil 2025-09-11 10:56:59 0 94
Telangana
చేప ప్రసాదం పంపిణీ
రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు. నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు...
By Vadla Egonda 2025-06-08 02:05:43 0 1K
Telangana
ఆషాడ మాస బోనాల సందర్భంగా 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ పూజలు.
మల్కాజిగిరి జిల్లా /ఆల్వాల్ ఆశాడ మాస  బోనాల పండుగ సందర్బంగా వెంకటాపురం డివిజన్‌లోని...
By Sidhu Maroju 2025-07-20 15:35:19 0 914
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com