హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు

0
811

సికింద్రాబాద్...

 

గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిటిడి బోర్డు సభ్యుడు,జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షులు రాదారం రాజలింగం, కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జి ప్రేమ్ కుమార్ లు తోటి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారిని ఆలయ పూజారులు ఆశీర్వదించి సన్మానించారు.తదనంరం ఆలయం ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... మా దైవం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని... హరిహర వీరమల్లు సినిమా విజయవంతమైనందుకు పవన్ కళ్యాణ్ గోత్రం, పేరుతో అర్చన చేపించి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ కూడా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటారని చెప్పారు. కొందరు ఈ సినిమా పై విమర్శలు చేస్తున్నారని...ఒక సినిమాని సినిమా లాగానే చూడాలి గాని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని అది తగ్గదన్నారు.త్వరలో దేశంలో ఆక్టివ్ పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఉంటారని ఈ సందర్భంగా వారు అన్నారు.

Search
Categories
Read More
Telangana
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర...
By Sidhu Maroju 2025-09-27 10:43:26 0 114
Telangana
పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. ...
By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com