ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . 

0
640

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ . 

ఈ సందర్భంగా తరగతి గదుల్లో పరిశుభ్రతను పాటించాలని, పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ,వంట సరుకుల నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పదవ తరగతి విద్యార్థులకు బోధన పద్ధతులను సమీక్షించి, విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బోధన, పిల్లల సౌకర్యాలలో ఎలాంటి లోపాలు ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని తెలిపారు.

ఈ పర్యటనలో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, మల్లాపూర్ తహసిల్దార్ రమేష్ మరియు  ఎంపీడీవో శశికుమార్ సంబంధిత అధికారులు కలెక్టర్ గారితో కలిసి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్
మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు వైసిపి విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో ప్రకాశం...
By mahaboob basha 2025-07-12 15:11:45 0 985
Manipur
Imphal East Security Forces Arrest Insurgent, Recover Weapons |
Security forces in Imphal East district arrested an active insurgent and his associates during...
By Pooja Patil 2025-09-16 06:55:29 0 62
Chandigarh
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence
62-Year-Old Woman Acquitted in Cheating Case Due to Lack of Evidence In a recent judgment, a...
By BMA ADMIN 2025-05-21 05:42:18 0 2K
Tamilnadu
తిరుచ్చి రైతుల డిమాండ్: నిబంధనలులేని ధాన్యం కొనుగోలు. |
తిరుచ్చిరాపల్లి జిల్లాలో bumper పంట వచ్చినా, నేరుగా కొనుగోలు కేంద్రాల్లో (DPCs) వేలాది టన్నుల...
By Deepika Doku 2025-10-10 05:14:06 0 45
Kerala
Kerala to Produce Local Snakebite Antivenom on World Snake Day
At a World Snake Day event, Kerala’s Forest Minister A. K. Saseendran announced a plan to...
By Bharat Aawaz 2025-07-17 08:36:02 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com