Bharat Aawaz

కార్తీక మాసం తొలి రోజున జూలూరుపాడు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆకాశదీపం వెలిగింపు

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
6
Views

కార్తీక మాసం తొలి రోజున జూలూరుపాడు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆకాశదీపం వెలిగింపు

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – జూలూరుపాడు మండలం: కార్తీక మాసం తొలి రోజును పురస్కరించుకుని జూలూరుపాడు మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పవిత్ర ఆకాశదీపం పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

 

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆకాశదీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

 

ఈ సందర్భంగా మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆకాశదీపం వెలిగింపు కార్యక్రమంలో పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక మాసం తొలి రోజున ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.