పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించిన: శరణగిరి దుంపల

0
1K

అల్వాల్, వెంకటాపురం కొత్తబస్తీ లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్వాల్ మండల డిప్యూటీ తాసిల్దార్ పృథ్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను వివరించడం జరిగింది. దళిత గిరిజనులకు ఎవరికైనా సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తులసి అల్వాల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమ్యశ్రీ, ఎస్సీ ఎస్టీ Poa Act. మెంబర్ శరణ్ గిరి దుంపల కొత్తబస్తీ వెంకటపురం గ్రామ ప్రజలు అంబేద్కర్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com