Bharat Aawaz

7వ డివిజన్‌లో పారిశుధ్య పనులు చేపట్టిన కార్పొరేటర్ ఏల్పుల రవీందర్

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
37
Views

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్‌లో ఈరోజు ఉదయం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  నాయకత్వంలో, మేయర్ ధరణి మధుకర్  సహకారంతో 7వ డివిజన్ కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పారిశుధ్య సిబ్బందితో కలిసి డివిజన్‌లోని రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయించారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టి కుప్పలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు. డివిజన్ ప్రజలు తమ ఇళ్ల నుంచి వెలువడే చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన చెత్త సేకరణ వ్యవస్థకు అందించాలని కోరారు. పారిశుధ్య నిర్వహణలో ప్రజలందరూ భాగస్వాములై 7వ డివిజన్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.