0
Comments
14
Views
గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసే ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఓటు అభ్యర్థి ఓటు వేసేదాకా అతనికి ఎటువంటి అంతరాయం కలగకుండా సూపర్వైజర్లు, ఎలక్షన్స్ సిబ్బంది జాగ్రత్త వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం 65965 మంది ఓటర్లకు గాను 46331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పురుషులు 22,488, మహిళలు 23,836 ఓట్లు పోలయ్యాయి. దీంతో 70.23% పోలింగ్ నమోదయింది.ఉదయం నుంచి కొనసాగిన పోలింగ్ ప్రక్రియ ముగియటంతో అధికారులు తదుపరి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాటు చేస్తున్నారు.